వివాదాల వల్లే రాజ్ తరుణ్ సినిమాలు నిండా మునిగాయా.. పాజిటివ్ టాక్ వచ్చినా లాభం లేదా?
TeluguStop.com
సాధారణంగా కొన్నిసార్లు వివాదాలు సినిమాలకు ప్లస్ అవుతుంటాయి.వివాదాల వల్ల బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సినిమాలు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
అయితే గత కొంతకాలంగా రాజ్ తరుణ్( Raj Tarun ) పలు వివాదాల్లో చిక్కుకోగా ఆ వివాదాలు రాజ్ తరుణ్ కు మైనస్ అయ్యాయే తప్ప ప్లస్ కాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వివాదాల వల్లే రాజ్ తరుణ్ సినిమాలు నిండా మునిగాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు, తిరగబడర సామీ సినిమాలు( Purushothamudu , Tiragabadara Saami ) కేవలం వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయి.
ఈ రెండు సినిమాలలో పురుషోత్తముడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరైన ప్రమోషన్స్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.
శ్రీమంతుడు, పిల్ల జమిందార్ తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి కలెక్షన్లను సొంతం చేసుకోలేదు.
"""/" /
రాజ్ తరుణ్ సైతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం పురుషోత్తముడు సినిమాపై ఎఫెక్ట్ చూపింది.
మరోవైపు నిన్న విడుదలైన తిరగబడర సామీ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి పూర్తిస్థాయిలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.రొటీన్ కథ, కథనంతో తెరకెక్కడంతో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.
"""/" /
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ ( Uyyala Jampala, Kumari 21 F )సినిమాల ద్వారా కెరీర్ తొలినాళ్లలో విజయాలను అందుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే విషయంలో ఫెయిలవుతున్నారు.
అయితే రాజ్ తరుణ్ చేతిలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు ఉండటం కొసమెరుపు.
రాజ్ తరుణ్ పారితోషికం మాత్రం భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఆరోగ్యానికి మంచిదని పనీర్ ను పదేపదే తింటున్నారా.. అయితే డేంజరే..!