వివాదాస్పద సినిమాలకే వసూళ్లు.. ఇదెక్కడి విడ్డూరం!

ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి.ఎలాంటి సినిమా లు ఫ్లాప్ అవుతున్నాయి అనే విషయంలో అస్సలు స్పష్టత రావడం లేదు.

బాక్సాఫీస్( Box Office ) వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్న సినిమాల్లో ఎక్కువ శాతం వివాదాస్పద సినిమాలు ఉంటున్నాయి అంటూ తాజాగా ఒక అధ్యాయనంలో వెళ్లడి అయ్యింది అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొంది.

"""/" / జాతీయ స్థాయి లో లేదా స్థానికంగా ప్రమోషన్‌ కార్యక్రమాల విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

కానీ వారికి ఏదో ఒక వివాదం తోడు అయితే తప్ప సినిమా కు మంచి పబ్లిసిటీ దక్కడం లేదు.

సినిమా గురించి కేసు అవ్వడం లేదంటే ఏదో ఒక సంఘం వారు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ మీడియా ముందుకు రావడం వల్ల మాత్రమే సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అవుతుంది అనడంలో సందేహం లేదు.

"""/" / హీరో లేదా హీరోయిన్‌ స్టార్స్ అయినా కూడా వివాదం వల్ల వచ్చే పబ్లిసిటీ ఎక్కువ అనే విషయం చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది.

అందుకే కొందరు ఫిల్మ్ మేకర్స్ కావాలని కూడా తమ సినిమాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కేరళ స్టోరీ( The Kerala Story ) దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది.

అదా శర్మ ( Ada Sharma )ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

వివాదం కారణంగా సినిమా గురించి గత కొన్ని వారాలుగా తెగ హడావుడి జరిగింది.

వివాదాస్పద అంశం అంటూ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.చాలా రాష్ట్రాల్లో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది.

సినిమా ను తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బ్యాన్ చేయడం జరిగింది.

థమన్ ఆవేదన గురించి రియాక్ట్ అయిన చిరంజీవి.. అలా కామెంట్లు చేశారా?