జావెలిన్ గురించి తెలీదంటూ కాంట్రవర్షల్ కామెంట్స్.. ట్రోలర్స్‌కి ఇచ్చిపడేసిన సైనా నెహ్వాల్..?
TeluguStop.com
ఇటీవల స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్( Saina Nehwal ) జావెలిన్ అనే ఆట గురించే తెలియదని, నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన తర్వాతే తెలిసిందని షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో కొంతమంది ఆమెను 'ఇండియన్ స్పోర్ట్స్‌లోని కంగనా రనౌత్' అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండదు, తనకు ఎవరూ తెలియదు అంటూ మాట్లాడుతుంది కదా! చైనా కూడా ఇప్పుడు అలానే చులకనగా మాట్లాడుతుంది అంటూ చాలామంది ఫైర్ అవుతున్నారు.
మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సైనా ఈ విమర్శలకు రియాక్ట్ అవుతూ "కంగనా చాలా అందంగా ఉంటుంది" అంటూ వారికి 'ధన్యవాదాలు' చెప్పింది.
"""/" /
"సైనా నెహ్వాల్ తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇస్తూ, "మీరు చేసిన ప్రశంసకు ధన్యవాదాలు.
కంగనా చాలా అందంగా ఉంటుంది.కానీ నేను నా ఆటలో పర్ఫెక్ట్ గా ఉండాల్సి వచ్చింది .
అందుకే బ్యాడ్మింటన్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ అయ్యాను, ఒలింపిక్ పతకం కూడా గెలుచుకున్నాను.
ఇంట్లో కూర్చుని ఎవరైనా ఏదైనా అనవచ్చు.కానీ క్రీడలు ఆడటం చాలా కష్టం" అని చెప్పింది.
"""/" /
ఆ తర్వాత నీరజ్ చోప్రా ( Neeraj Chopra )గురించి మాట్లాడుతూ, "నీరజ్ మన దేశానికి గొప్ప గౌరవం తెచ్చాడు.
జావెలిన్ అనే ఆటను భారతదేశంలో చాలా పాపులారిటీలోకి తెచ్చాడు." అని ప్రశంసించింది.
సైనా నెహ్వాల్ జావెలిన్ గురించి మాట్లాడుతూ, "నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచినప్పుడే జావెలిన్ అనే ఆట గురించి నాకు తెలిసింది.
అంతకు ముందు నాకు ఈ ఆట గురించి ఏమీ తెలియదు.అథ్లెటిక్స్‌లో ఇన్ని రకాల ఆటలు ఉన్నాయని నాకు తెలుసు, కానీ జావెలిన్ గురించి తెలియదు.
నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడే నాకు ఈ ఆట గురించి తెలిసింది.ఇలాగే చాలామందికి బ్యాడ్మింటన్ గురించి తెలియదు.
ప్రకాష్ పడుకునే ( Prakash Padukone )ఎవరో కూడా నాకు తెలియదు" అని చెప్పింది.
సైనా బ్యాడ్మింటన్ ఇంకా మాట్లాడుతూ "తెలుసుకోవాలని అనుకోకపోవడం కాదు, కానీ మనం మన పనిలో చాలా బిజీగా ఉంటాము కాబట్టి, మరొక విషయం గురించి లోతుగా ఆలోచించడానికి సమయం దొరకదు.
లేకపోతే ప్రతి చిన్న విషయానికీ గూగుల్ చేస్తూ ఉండాలి.మనం మన పనిలో నిపుణులుగా ఉంటే అంతే చాలు.
" అయితే ఆమె మాటలు విని చాలా మంది షాకయ్యారు.సైనా జావెలిన్ గురించి తెలియదు అంటూ నటిస్తోందని, ఆమె మాట మాట్లాడిందని ఇప్పటికీ తమ నమ్మలేకపోతున్నామని చాలామంది విమర్శిస్తున్నారు.
చిరంజీవి విశ్వంభర సినిమాతో సక్సెస్ కొడతాడా..?