పోలీసులకంటే కండోమ్‌లే బెటర్.. దుమ్ములేపుతున్న యాడ్

టీవీల్లో వచ్చే యాడ్‌లను జనాలు ఎక్కువగా పట్టించుకోరు.నూటిలో ఒకటో రెండో యాడ్‌లు ప్రజలను ఇంప్రెస్ చేయడంతో వాటి గురించి జనాలు చర్చించుకుంటారు.

కానీ సోషల్ మీడియాలో వచ్చే కొన్ని యాడ్ లేదా పోస్టులకు సంబంధించి తీవ్ర చర్చ సాగుతుంటుంది.

తాజాగా ఇలాంటిదే ఓ యాడ్ చర్చనీయాంశంగా మారింది.కండోమ్ తయారీ కంపెనీలలో డ్యూరెక్స్ కండోమ్‌లు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

ఈ కంపెనీ తయారు చేసే కండోమ్‌లు చాలా నాణ్యతగా ఉంటాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఢిల్లీలో శాంతిభద్రతల రక్షణలో పోలీసులు విఫలమయ్యారంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో ఢిల్లీ పోలీసులకంటే కూడా డ్యూరెక్స్ కండోమ్‌లు చాలా పటిష్టంగా పనిచేస్తాయంటూ ఓ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

""img "aligncenter" Src="" / అయితే ఈ యాడ్ తమ కంపెనీ నుండి ప్రచురించబడింది కాదని డ్యూరెక్స్ వెల్లడించింది.

కాగా ఎవరో ఢిల్లీ పోలీసుల పనితీరును విమర్శిస్తూ ఈ పోస్టును సోషల్ మీడియాలో పెట్టారని, అది కాస్త వైరల్‌గా మారిందని పలువురు అంటున్నారు.

బాలయ్య బోయపాటి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు.. ఆ పాత్రలో కనిపిస్తారా?