ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్.. పంజాబ్ సర్కార్ వినూత్న ఆలోచన
TeluguStop.com
పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయుల సమస్యలపై సీఎం భగవంత్ మాన్ సర్కార్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
తమ చర్యల వల్ల ఎన్ఆర్ఐలకు త్వరగా న్యాయం జరుగుతుందని పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ పేర్కొన్నారు.
బుధవారం ఛండీగడ్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు.అనంతరం కుల్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.
ఇక్కడ ప్రభుత్వం 10 మంది సిబ్బందిని నియమించిందని, ఇది ప్రతి కేసును విచారించి ఫిర్యాదులను పరిష్కరిస్తోందని మంత్రి తెలిపారు.
ఎన్ఆర్ఐలు తమ సమస్యల పరిష్కారం కోసం 9056009884 నెంబర్‌కు ఫోన్ చేయాలని కుల్‌దీప్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
"""/" /
అలాగే కెనడియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు పంజాబ్‌లో కార్యాలయాన్ని ప్రారంభించడం పట్ల కుల్‌దీప్ సింగ్ అభినందనలు తెలిపారు.
ఇన్వెస్ట్ పంజాబ్ పథకం కింద ఇది స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా.పంజాబ్ యువతకు ఉపాధి లభించేలా ఇన్వెస్ట్ పంజాబ్ క్యాంపెయిన్ కింద ప్రవాసాంధ్రులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మరింత అండగా వుంటుందని పంజాబ్ రవాణా మంత్రి లాల్జీత్ సింగ్ భుల్లార్ అన్నారు.
అలాగే ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పంజాబీ ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. """/" /
ఇకపోతే.
గత నెలలో అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం కుల్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.ఎన్ఆర్ఐల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కూడా ప్రారంభించామని కుల్‌దీప్ సింగ్ తెలిపారు.
అమృత్‌సర్, మోగా, లూథియానా, ఎస్‌బీఎస్ నగర్, పాటియాలలో కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్‌లలో ప్రత్యేక పోస్టులను సృష్టించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు పంపనున్నట్లు కుల్‌దీప్ సింగ్ తెలిపారు.
ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్‌లను రూ.30 లక్షలతో పునరుద్ధరిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని.
అలాగే తక్షణం 75 మంది పోలీసులను నియమిస్తానని చెప్పారని కుల్‌దీప్ సింగ్ పేర్కొన్నారు.
మార్చి నాటికి మరో 75 మంది పోలీసులను ఈ పోలీస్ స్టేషన్‌లలో నియమిస్తామని డీజీపీ చెప్పినట్లు ఎన్ఆర్ఐ మంత్రి స్పష్టం చేశారు.
బడ్జెట్‌పై ఎన్ఆర్ఐల ఆశలు .. పన్ను చెల్లింపులపై భారత ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు