Tomato Crop : టమాటో పంటను ఆశించే లీఫ్ మైనర్ తెగుళ్లను నివారించే పద్ధతులు..!

కూరగాయ పంటలలో టమాటో ప్రధాన పంట.టమాటో పంటకు మార్కెట్లో ఎప్పుడు మంచి ధర ఉంటుందో ఉండదో ఊహించడం కూడా కష్టమే.

కాబట్టి టమాటో పంటను( Tomato Crop ) ఒకేసారి అధిక విస్తీర్ణంలో కాకుండా విడుదల వారీగా సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందడంతో పాటు మంచి లాభాలు పొందవచ్చు.

టమాటో పంట సాగుకు ఇసుక, బంక మట్టి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

నీరు నిల్వ ఉందని నల్లరేగడి నేలలు కూడా ఈ పంట సాగుకు అనుకూలంగానే ఉంటాయి.

నేల యొక్క పీహెచ్ విలువ( PH Value ) 6.0-7.

0 గా ఉంటే పంట వృద్ధి ఆశాజనకంగా ఉంటుంది.తెగులు నిరోధక మేలురకం నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

నారు నాటడానికి ముందు నేలకు ఒకసారి నీటి తడి అందించాలి.నాలుగు రోజుల తర్వాత ప్రధాన పొలంలో నారు నాటుకోవాలి.

టమాటో పంటను వరుసగా వేయకుండా పంట మార్పిడి పద్ధతి పాటించాలి.రెండు టమాటో పంటల మధ్య కనీస విరామ సమయం ఒక సంవత్సరం ఉండేలా సాగు చేయాలి.

పంట మార్పిడి వల్ల తెగుళ్ల, చీడపీడల వ్యాప్తి( Pests ) తక్కువగా ఉంటుంది.

"""/" / నారు నాటిన ఐదు రోజుల తర్వాత నీటి తడి అందించాలి.

ఆ తర్వాత నేలలోని తేమశాతాన్ని బట్టి ఖరీఫ్ లో( Kharif ) అయితే 8 రోజులకు ఒకసారి, రబీలో అయితే 12 రోజులకు ఒకసారి, వేసవికాలంలో అయితే ఐదు రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.

టమాటో పంట పుష్పించే మరియు కాయ దశలో ఉన్నప్పుడు నీటి అవసరం చాలా ఎక్కువ.

ఈ సమయాలలో నీటిని అందించడంలో ఆలస్యం చేయకూడదు. """/" / టమాటో పంటకు లీఫ్ మైనర్( Leaf Miner ) తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.

ఈ తెగుళ్ల వల్ల మొక్క ఆకుపై తెల్లని చారలు ఏర్పడతాయి.దీనివల్ల మొక్కలో కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ తగ్గుతుంది.

ఇక ఈ తెగుళ్లు కాయ అభివృద్ధిపై భావం చూపిస్తాయి.పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ తెల్లని చారలు ఉన్న ఆకులను మొక్క నుండి తొలగించాలి.

4 శాతం వేపనూనెను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే ఒక మిల్లీ లీటరు ట్రయాజోఫాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

హ‌లో అబ్బాయిలు.. ద‌ట్ట‌మైన గ‌డ్డాన్ని కోరుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకే!