పార్కులు, డివైడర్లలో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పార్కులు , డివైడర్లు, సర్కిల్లలో శానిటేషన్ , క్లీనింగ్ , గ్రీనరీ , ప్లాంటేషన్ విభాగాలలో పనిచేస్తున్న దాదాపు 50 మంది కార్మికులకి కాంట్రాక్టర్ నుండి రావలసిన 5 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే ఇప్పించాలని కాంట్రాక్టు ద్వారా కాకుండా వీరికి నేరుగా మున్సిపల్ ద్వారానే ఉపాధి కల్పించి వేతనాలు అందించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టి జిల్లా పరిపాలన అధికారి కి సమస్యలపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎలిగేటి రాజశేఖర్ లు మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలోని పార్కులు , డివైడర్లు , సర్కిల్లలో పారిశుద్ధ్య నిర్వహణ మొక్కల పెంపకానికి సంబంధించి సిరిసిల్ల మున్సిపల్ పట్టణం లోని నెహ్రూ నగర్ కు చెందిన వరలక్ష్మి స్లం సమాఖ్య , బి.
వై.నగర్ కు చెందిన చైతన్య స్లం సమాఖ్య, శ్రీ రాజరాజేశ్వర స్లం సమాఖ్య విద్యానగర్ కు చెందిన నాగదేవత స్లం సమాఖ్యల పేర్లపై మున్సిపల్ పాలకవర్గానికి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు కాంట్రాక్ట్ తీసుకొని కార్మికులకు నెలకు కేవలం 6 వేల నుండి 7500 /- రూపాయలు మాత్రమే తక్కువ వేతనాలు చెల్లిస్తూ కూడా దాదాపు మున్సిపల్ నుండి బిల్లులు రావడం లేదు అనే కారణంతో
5,6 నెలల నుండి వీరికి జీతాలను చెల్లించకపోవడం అన్యాయం అన్నారు.
కాంట్రాక్టర్ ను జీతాలు అడుగుతే మున్సిపల్ నుండి మాకు బిల్లులు రావడంలేదని బిల్లులు వచ్చినంక వేతనాలు ఇస్తామని చెబుతున్నారని మున్సిపల్ కమిషనర్ ని వెళ్లి అడిగితే మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని మీ జీతాల గురించి కాంట్రాక్టర్ నే అడగాలని చెబుతున్నారన్నారు.
ఐదు నెలల నుండి వేతనాలు లేక కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది.
కావున కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని వీరికి రావలసిన ఐదు నెలల పెండింగ్ వేతనాలను ఇప్పించాలని,
అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పని చేస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్న వీరికి కాంట్రాక్టు గడువు ముగియడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.
కావున వీరికి కాంట్రాక్టు ద్వారా కాకుండా నేరుగా మున్సిపల్ నుండే ఉపాధి కల్పించి వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకుని వీరికి న్యాయం చేయాలని కోరారు.
నర్సయ్య శారద , గీత , శ్రీకాంత్ , రాకేష్ , ఇంద్రవ్వ , మనేమ్మ , అనసూర్య , లక్ష్మి , కనకవ్వ , వంశీ , ప్రియాంక , కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మలయాళ హీరోతో తెలుగు హీరోలకు ముప్పు తప్పదా..?