అయోధ్య రామయ్య శిల కోసం నా భార్య తాళి తాకట్టు పెట్టా.. కాంట్రాక్టర్ శ్రీనివాస్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
ఇటీవల జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట( Balaram's Prana Prishta ) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బాల రాముడిని లక్షలాది మంది వేలాది మంది భక్తులు నిరంతరం దర్శించుకుంటూనే ఉన్నారు.
అయితే రోజురోజుకీ అయోధ్యకు చేరుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ అవడం లేదు.
అయోధ్యలో కొలువైన ఆ బాల రామున్ని చూడడం కోసం దేశం నలుమూలలా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఉన్న భారతీయులు కూడా అయోధ్యకు చేరుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే అయోధ్య రామమందిరంలో కొలువైన బాల రాముని విగ్రహాన్ని చూసి భక్తులు పులకించిపోతున్నారు.
"""/" /
ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్( Arun Yogiraj )ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
పొలంలో నుంచి ఆ రాతిని బయటకు తీసిన గుత్తేదారు శ్రీనివాస్( Guttedaru Srinivas ) మాత్రం దీని వెనుకున్న తన కన్నీటి గాథను తాజాగా వెల్లడించారు.
కాగా కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా హెచ్‌డీ కోట తాలూకా బుజ్జేగౌడనపురలోని ఒక పొలంలో ఈ రాయి ఉన్నట్లు మొదట గుర్తించారు.
దాన్ని బయటకు తీసేందుకు సంబంధిత రైతు శ్రీనివాస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.దాన్ని బయటకు తీసినందుకు ఆయనకు రుసుము ఇచ్చారు.
కార్మికులకు చెల్లింపుల అనంతరం గుత్తేదారుకు రూ.25 వేల వరకు మిగిలింది.
అనంతరం తమ అనుమతి తీసుకోకుండా పొలాన్ని తవ్వి, రాతిని బయటకు తీశారంటూ శ్రీనివాస్‌కు ఆ రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
"""/" /
రూ.80 వేలు కట్టాలని, లేదంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అందులో హెచ్చరించారు.
చేతిలో డబ్బు లేకపోవడంతో తన భార్య తాళిని తాకట్టు పెట్టి జరిమానా చెల్లించారట.
అప్పటికి తనకు వివాహమై ఎనిమిది నెలలే అయిందని అధికారులు హెచ్చరించడంతో విధిలేని పరిస్థితుల్లో తాళిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి వారికి చెల్లించానని శ్రీనివాస్ తెలిపారు.
అప్పట్లో ఆ రాతిని రాముడి శిల్పం కోసం ఎంచుకుంటారని ఆయనకు తెలియదు.తరువాతి పరిణామాల్లో ఆ రాతిని చూసిన వారు మేలురకమని గుర్తించి అయోధ్యకు తరలించారు అని చెప్పుకొచ్చారు శ్రీనివాస్.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీడియో: టీచర్‌ని అపహరించి.. చివరికి ఏం చేశారో చూడండి..