రౌడీ షీటర్స్,హిస్టరీ షీటర్స్ లపై నిరంతర పర్యవేక్షణ..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్, వేములవాడ రూరల్, బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిద రకాల నేరాలలో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు,హిస్టరీ షీట్లు ఉన్న వారికి వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ.

ఈ సందర్భంగా ఎస్పీ( District SP Akhil Mahajan) మాట్లాడుతూ.వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరువబడిన నేరచరితులు విధిగా పోలీసు వారు తెలిపిన సమయాల్లో పోలీస్ స్టేషన్ హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయడం జరుగుతుందని అన్నారు.

రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సత్ప్రవర్తనతో మెదులుతున్న వారిని గుర్తించి వారిపై ఉన్న షీట్స్ ను తొలగించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో గంజాయి నియంత్రణ( Marijuana )కు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని,గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, డ్రంక్ & డ్రైవ్ తరహాలో గంజాయి కిట్లతో తనిఖీలు చేస్తున్నామని, గంజాయి పాజిటివ్ వచ్చిన వారి నుంచి సరఫరా దారులను పట్టుకుంటున్నామని తెలిపారు ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రేడ్డి,సి.

ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్.ఐ లు మారుతి,పృథ్వీందర్ గౌడ్,అంజయ్య, సిబ్బంది ఉన్నారు.

రామ్ కి సక్సెసులు రావాలంటే ఇదొక్కటే దారి…