ఉప్పెనలా లోకేశ్ పాదయాత్ర..: అచ్చెన్నాయుడు
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగన్ యువత ఆశలను అడియాశలు చేశారని ఆరోపించారు.అయితే రాష్ట్ర యువత భవిష్యత్ కోసం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.
యువగళం పాదయాత్రను ఆపడానికి వైసీపీ ఆటంకాలు సృష్టించిందన్నారు.కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉప్పెనలా లోకేశ్ పాదయాత్ర సాగిందని తెలిపారు.
ఈనెల 18న యువగళం పాదయాత్ర ముగింపు సభ ఉండనుందని వెల్లడించారు.ఈ మేరకు భోగాపురం మండలం పోలిపల్లిలో సభ ఉంటుందన్న అచ్చెన్నాయుడు ఈ సభకు చంద్రబాబు, బాలకృష్ణతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరవుతారని తెలిపారు.
2024 ఎన్నికల శంఖారావం అక్కడి నుంచే పూరిస్తామని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే మరో వంద రోజుల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!