డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్.. జాగ్రత్త పడకపోతే విజయ్ కు కష్టమేనా?

బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్ పరంగా ఎదిగి సక్సెస్ సాధించడం సులువు కాకపోయినా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) మాత్రం అలవోకగా స్టార్ స్టేటస్ అందుకున్నారు.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలతో విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో నిరాశ పరుస్తున్నారు.

ఖుషి సినిమాను మినహాయిస్తే విజయ దేవరకొండకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ షాకులు తగిలాయి.

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ( Dear Comrade Movie ) నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా వరల్డ్ ఫేమస్ లవర్( World Famous Lover ) ఎప్పుడు విడుదలైందో కూడా ఆయన అభిమానులలో చాలామందికి తెలియదు.

లైగర్ సినిమా( Liger Movie ) భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా అప్పుల బాధ వల్ల పూరీ జగన్నాథ్ ఎన్నో సమస్యలను ఫేస్ చేశారు.

"""/" / ఫ్యామిలీ స్టార్ మూవీ అయినా విజయ్ దేవరకొండ కోరుకున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది.

ఫ్యామిలీ స్టార్ మూవీ( Family Star Movie ) బుకింగ్స్ విషయంలో అభిమానులను ఒకింత తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.

ప్రముఖ మల్టీప్లెక్స్ లలో మాత్రమే ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి.ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్లు సైతం మరీ భారీ స్థాయిలో లేవు.

"""/" / విజయ్ దేవరకొండకు ఆఫర్ల విషయంలో ఎలాంటి సమస్య లేకపోయినా వరుసగా విజయాలు సాధించని పక్షంలో కొత్త మూవీ ఆఫర్లు రావడం కష్టమవుతుంది.

ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా విజయ్ దేవరకొండ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ పెరుగుతోంది.

న్యాచురల్ గా షైనీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!