ఆ ఎదురుదెబ్బల వల్లే వరుణ్ తేజ్ మారారా.. అన్ని కథలను వరుణ్ రిజెక్ట్ చేశారా?

మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) నటించిన సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

అయితే ప్రయోగాలు చేయడంలో వరుణ్ తేజ్ కు ఎవరూ సాటిరారని చాలామంది భావిస్తారు.

అయితే వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్( Flop Movies ) కావడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు మాత్రమే వరుణ్ తేజ్ కు ప్లస్ అయ్యాయి.

మంచి కథలను ఎంచుకుని ఇకపై విజయాలను సైతం అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో 12 కథలను రిజెక్ట్ చేశారని ఆ ప్రాజెక్ట్ లలో మెజారిటీ ప్రాజెక్ట్ లు ప్రముఖ బ్యానర్ల నుంచి ఆఫర్లు వచ్చిన ప్రాజెక్ట్ లు అని సమాచారం అందుతోంది.

గని,( Ghani ) గాండీవధారి అర్జున,( Gaandeevadhari Arjuna ) ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

"""/" / ప్రయోగాత్మక కథల కంటే కమర్షియల్ కథలకే వరుణ్ తేజ్ ఓటు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్ భవిష్యత్తు ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని వరుణ్ తేజ్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు ఎఫ్4 మూవీ( F4 Movie ) త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

"""/" / వరుణ్ తేజ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమాలో( Matka Movie ) నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

కరుణ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా వరుణ్ తేజ్ ఆశలను నెరవేరుస్తుందేమో చూడాలి.

వరుణ్ తేజ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే భారీ విజయాలు సొంతమయ్యే అవకాశాలు ఉంటాయి.

వైరల్ వీడియో: మహిళా పైలట్‌కు ఊహించని అనుభవం.. గాల్లో ఉండగా విమానం పైకప్పు ఓపెన్..