డబ్ల్యూపీఎల్ లో బెంగుళూరు జట్టుకు వరుస ఓటములు.. భావోద్వేగానికి లోనైన స్మృతి మంధాన..!
TeluguStop.com
డబ్ల్యూపీఎల్( WPL) లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా ఘోర ఓటములను ఖాతాలో వేసుకొని, చివరి స్థానంలో నిలిచింది.
డబ్ల్యూపీఎల్ లో మొత్తం ఐదు జట్లు పాల్గొంటే.నాలుగు జట్ల చేతిలో ఘోరంగా ఓడిపోయింది.
మిగిలిన నాలుగు జట్లలో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంది.ఇక ఢిల్లీ జట్టు రెండు మ్యాచ్లలో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది.
యూపీ వారియర్స్ రెండు మ్యాచ్లలో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది.గుజరాత్ జెయింట్స్ రెండు మ్యాచ్లలో ఓడి, ఒక మ్యాచ్లో గెలుపు సాధించింది.
కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక మ్యాచ్ లో కూడా విజయం సాధించకపోవడంతో జట్టు కెప్టెన్ స్మృతి మంధాన కన్నీటి పర్యంతరం అయింది.
"""/" /
చివరగా జరిగిన నాలుగో మ్యాచ్లో ఓటమి తర్వాత కెప్టెన్ స్మృతి(Smriti Mandhana) మాట్లాడుతూ.
బ్యాటింగ్ వైఫల్యాల కారణంగా వరుస పరాజయాలు ఎదురయ్యాయని, ఈ వరుస ఓటములకు తనదే బాధ్యత అంటూ తెలిపింది.
ఒక బ్యాటర్ గా తాను పూర్తిగా విఫలం అయ్యానంటూ, తనతో పాటు సహా ఆటగాళ్లు కూడా బ్యాటింగ్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఈ వరుస ఓటములు తమకు గుణపాఠం అని, ఓటములకు గల ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకొని మెరుగైన ఆట ప్రదర్శన తో ముందుకు సాగుతామని, తన కుటుంబం ఎప్పుడు తనకు మద్దతుగా ఇస్తుంది అని స్మృతి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై చెప్పిన మాటలు అభిమానులను కలచివేసింది.
"""/" /
చివరగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇక ఎలిస్ పెర్రీ అర్థ శతకం(Ellyse Perry ) తో చెలరేగగా, సోఫీ డివైన్ 36 పరుగులు చేసింది.
మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు.139 పరుగుల లక్ష్యచేదన లో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని చేదించి విజయం సాధించింది.
కెప్టెన్ అలిస్సా హీలీ 47 బంతులలో 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
దేవికా వైద్య 36 పరుగులతో నాట్ అవుట్ నిలిచింది.