Vijayasai Reddy : జగన్ ఆదేశాల మేరకే నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా పోటీ..: విజయసాయి రెడ్డి

ఏపీలో 99 శాతం హామీలను అమలు చేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( YCP MP Vijayasai Reddy ) అన్నారు.

రాష్ట్రంలో ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు.

అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని పేర్కొన్నారు.సిద్ధం సభా వేదికగా సీఎం జగన్( CM Jagan ) మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని తెలిపారు.

అదేవిధంగా సీఎం జగన్ ఆదేశాల మేరకే నెల్లూరు లోక్ సభ( Nellore Lok Sabha ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

"""/" / ఇక్కడే పుట్టి పెరిగానన్న విజయసాయిరెడ్డి గెలిచి ప్రజలకు సేవ చేస్తానన్నారు.

వేమిరెడ్డి తనకు మంచి మిత్రుడని చెప్పారు.అయితే స్నేహం వేరు, రాజకీయం వేరని పేర్కొన్నారు.

జిల్లా మీద తనకు పూర్తిగా అవగాహన ఉందని తెలిపారు.రాజ్యసభ సభ్యులుగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశానన్నారు.

ఈ క్రమంలోనే పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

ఫ్లిప్‌కార్ట్‌కు మొట్టికాయ వేసిన కోర్టు.. మ్యాటరేంటంటే?