కేసీఆర్ పై పోటీ : ' ఈటెల ' నిర్ణయం సరైందేనా ?
TeluguStop.com
తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యాన్ని బిజెపి విధించుకోగా.
హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాత్రం కేసిఆర్ ను ఎమ్మెల్యేగా ఓడించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తూ, కేసీఆర్ కు సవాల్ ను విసురుతున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పై ఈటెల రాజేందర్ ఫోకస్ పెట్టారు.
పోటీ చేసి గెలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పై పోటీ చేసి గెలవడం అంత ఆషామాషీ కాదనే విషయం రాజేందర్ కు బాగా తెలుసు.
అయినా ఈ విధమైన ప్రకటనలు చేస్తుండడంతో ఆయనపై బిజెపి అధిష్టానం ఒత్తిడి ఉందా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
గజ్వేల్ నియోజకవర్గం లో కేసిఆర్ పై పోటీ చేసినా.గెలుపు అంత అషామాషిగా ఉండదు.
ఇప్పటికే అక్కడ కేసిఆర్ బలమైన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారు.కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళకపోయినా , ప్రజలు గెలిపించే పరిస్థితిలో ఉన్నారు.
ఈ మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక అధికారులను కేసీఆర్ నియమించారు.
అలాగే గజ్వేల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజల్లో కేసీఆర్ పేరుపొందారు.
ఈ విషయాలు ఈటల రాజేందర్ కు తెలియనివి కాదు.అయితే ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పై పోటీ చేయాలని అనుకోవడం వెనుక బిజెపి అధిష్టానం పెద్దల ఒత్తిడి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
"""/"/
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ పై పోటీగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సువెందు అధికారిని బిజెపి నిలబెట్టింది.
అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, మమత ఓటమిచెంది పరువు పోగొట్టుకున్నారు.ఇప్పుడు అదే ఫార్ములాను కేసీఆర్ విషయంలోనూ ఉపయోగించి సక్సెస్ అవ్వాలని , తద్వారా జాతీయ రాజకీయాల్లో తమకు ఇబ్బందులు సృష్టిస్తున్న కేసీఆర్ కు చెక్ పెట్టినట్టు అవుతుంది అనే ఆలోచనలో బిజెపి ఉన్నట్టుగా అర్థమవుతోంది.
అందుకే గజ్వేల్ నియోజకవర్గం నుంచి రాజేందర్ పోటీ చేస్తానంటూ పదేపదే ప్రకటనలు చేయడం వెనక కారణం అధిష్టానం పెద్దల ఒత్తిడే కారణం అని బీజేపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
నేషనల్ అవార్డు విషయంలో ట్రోల్ అవుతున్న బన్నీ.. ఇలా దొరికిపోయాడేంటీ?