తెలంగాణలో పోటీ: జనసేనకు లాభం కంటే నష్టమే ఎక్కువా ?
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ భవిష్యత్తు రీత్యా సరైనదే అని చాలామంది భావించినా బిజెపితో( BJP ) ఆ పార్టీ పొత్తు నిర్ణయం తర్వాత మాత్రం జనసేనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.
ముఖ్యంగా 10 నుంచి 11 స్థానాలకు జనసేన ను పరిమితం చేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయించుకోవడంతో జనసేన నామాత్రపు సీట్ల లో పోటీ చేయాల్సి ఉంటుంది ,అదీ కాక బిజెపి పోటీ చేస్తున్న అన్నీ స్థానాలలోనూ స్టార్ క్యాంపైనర్ గా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రచారం చేయాల్సి ఉంటుంది.
"""/" / అంటే అధికార బారాసతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడాల్సి ఉంటుంది.
ఇదంతా జనసేనకు శత్రువుల సంఖ్యను పెంచుకోవడమే తప్ప దానివల్ల ఓనకూరే అదనపు ప్రయోజనం ఉండదన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
ముఖ్యంగా కేసీఆర్ తో జనసేనకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
కెసిఆర్ తనయుడు కేటీఆర్ ( KTR )పవన్ ను సోదరుడిగా భావిస్తారు.
పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ పట్ల ఆయనఅభిమానం చూపించిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు నామమాత్రపు సీట్లలో పోటీ కోసం అధికారపక్షంతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల పవన్ కు వచ్చే లాభమేమి ఉండదని పైగా ఆంధ్రప్రదేశ్లో జనసేనకు అధికార వైసిపి వల్ల ఎదురవుతున్న అనేక ఇబ్బందులకు తెలంగాణ పరిష్కారం చూపిస్తుంది .
"""/" / ఆంధ్రా లో జరగని పనులను ఆయన తెలంగాణలో చక్కబెట్టుకున్న వైనం ఇంతకుముందు కూడా చూసాం.
ఇప్పుడు అధికార పార్టీతో సున్నం పెట్టుకుంటే ఇకముందు జనసేనకు అలాంటి విషయాలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా వారాహి రిజిస్ట్రేషన్ లాంటి విషయాలలో హైదరాబాదులో పవన్ పని చేయించుకోగలిగారు ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పవన్ ప్రచారం చేస్తే కనుక అధికార పార్టీ కూడా పవన్ పై నజర్ ప్రకటించే అవకాశం ఉంది.
తద్వారా భవిష్యత్తులో కొత్త సమస్యలు జనసేన ( Janasena )ఎదుర్కోవాల్సి రావచ్చు .
అయితే కేంద్ర బాజాపా మద్దతు ఉంది కదా అని ఆలోచించవచ్చు కానీ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించే బిజెపి వంటి పార్టీ కోసం జనసేన కొత్త ఇబ్బందులు తెచ్చుకోవడం అనవసరం అన్నది మెజారిటీ రాజకీయ పరిశీలకులు బావన గా తెలుస్తుంది .
ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!