మేడ్చల్ జిల్లాలో కంటైనర్ లారీ దగ్ధం..!!

మేడ్చల్ జిల్లాలో ప్రమాదం జరిగింది.ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రోడ్డుపై వెళ్తున్న సమయంలో కంటైనర్ కు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు అంటుకున్నాయి.

మేడ్చల్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కంటైనర్ లారీలో మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకుంది.

దీంతో మిగతా వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 3, సోమవారం2025