ఈ టీ ని అధికంగా సేవించడం వల్ల కిడ్నీలకు ప్రమాదమా..?

ప్రతిరోజు ఉదయం టీ ( Tea )తాగడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హాని చేస్తుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అంశం పై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

టీ నీ మితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పరిశోధనలు చెబుతున్నారు.

ముఖ్యంగా బ్లాక్ టీ( Black Tea ) ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి.ఈ టీ గుండె నుంచి మధుమేహం వరకు సమస్యలను మెరుగుపరుస్తుంది.

"""/" / కరోనా మహమ్మారి సమయంలో బ్లాక్ టీ ప్రజలకు ఎంతో బాగా ఉపయోగపడింది.

ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇది ఎటువంటి అంటువ్యాధుల నుంచి అయినా సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది.

కానీ కొన్ని నివేదికలలో బ్లాక్ టీ ని ఎక్కువగా తీసుకోకూడదని, అది మూత్రపిండాల( Kidney ) వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

మీరు దీన్ని తక్కువ పరిమాణంలో తాగినంత కాలం మాత్రమే దానీ వినియోగం సురక్షితం.

ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహం నుంచి గుండెజబ్బుల వరకు అన్నిటికి బ్లాక్ టీ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది.

కాబట్టి ఇది మూత్రపిండాలకు ఎలా హానికరం అని అర్థం చేసుకోవడానికి కొన్ని అధ్యయనాలు జరిగాయి.

"""/" / టీ కాఫీలలో కేఫిన్( Caffeine ) అనే పదార్థం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

ఇది మూత్రపిండాలపై సానుకూల, ప్రతికూల ప్రభావలను కలిగిస్తుంది.అయితే కేఫిన్ మూత్రపిండాలపై ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉన్నట్లు తెలిసినప్పటికీ ఇది కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది.

కొన్ని అధ్యయనాలు అధికంగా కేఫిన్ తీసుకోవడం వల్ల సిస్టోలిక్ , డయాస్టొలిక్ రక్తపోటు రెండిటిని పెంచుతుందని కనుగొన్నారు.

కిడ్నీ వ్యాధికి అధిక రక్తపోటు ప్రమాదకరం కాబట్టి కేఫిన్ అధికంగా ఉండే ఆహారాలు ఆ సమస్యల ప్రభావాన్ని పెంచుతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే బ్లాక్ టీ ని మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలు సమస్య పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.