నిత్యం ఈ పొడిని తీసుకుంటే షుగర్ కంట్రోల్ తో సహా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం!
TeluguStop.com
ఇటీవల రోజుల్లో మధుమేహం తో( Diabetes ) బాధపడుతున్న వారి సంఖ్య ఎంత భారీగా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇంటికి కనీసం ఒక్కరైనా షుగర్ పేషెంట్ ఉంటున్నారు.మధుమేహం వచ్చాక షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి చాలా కష్టపడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ పొడి మీకు చాలా బాగా సహాయపడుతుంది.
నిత్యం ఈ పొడిని తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
"""/" /
పొడి తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు అవిసె గింజలు( Flax Seeds ) మరియు ఒక కప్పు సోంపు గింజలు వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో రోస్ట్ చేసి పెట్టుకున్న అవిసె గింజలు, సోంపు మరియు గుమ్మడి గింజలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి. """/" /
రోజు ఉదయం తయారు చేసుకున్న పొడిని ఒక స్పూన్ చొప్పున తీసుకుని ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ సేవించాలి.
నిత్యం ఏ విధంగా కనుక చేసే రక్తంలో చక్కెర స్థాయిలు( Blood Sugar Levels ) నియంత్రణలో ఉంటాయి.
మధుమేహం వ్యాధి మీ కంట్రోల్ లో ఉంటుంది.అలాగే ఈ పొడిని తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.
కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.జీర్ణ క్రియ చురుగ్గా మారుతుంది.
మలబద్ధకం సమస్య ఉంటే పరారవుతుంది.అలాగే ఈ పొడి మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు చెక్ పెడుతుంది.
మెదడును చురుగ్గా మారుస్తుంది.గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.
కాబట్టి మధుమేహం ఉన్న వారే కాదు ఎవరైనా సరే ఈ పొడిని తమ డైట్ లో చేర్చుకోవచ్చు.
ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
క్యా క్యాచ్ హే మాక్స్… అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!