కళ్లద్దాలు లేని కంటి చూపు పొందాలనుకుంటున్నారా.. అయితే మీ డైట్ లో ఇది కచ్చితంగా ఉండాల్సిందే!

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిలో కంటి చూపు ( Eye Sight )అనేది నెమ్మదిస్తుంది.

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, అధిక స్క్రీన్ టైమ్ తదితర అంశాలు కంటి చూపు తగ్గడానికి కారణం అవుతుంటాయి.

దీంతో కళ్లద్దాలపై ఆధారపడుతున్నారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? కళ్లద్దాలు లేని కంటి చూపు పొందాలని అనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీ డైట్ లో కచ్చితంగా ఉండాల్సిందే.

ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా కనుక తీసుకుంటే మీ కంటి చూపు అద్భుతంగా పెరుగుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం కంటి చూపును పెంచే జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్న పదండి .

"""/" / ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ క్యారెట్ తురుము( Grate Fresh Carrot ) వేసుకోవాలి.

అలాగే 6 నుంచి 8 నానబెట్టి తొక్క తొలగించిన బాదంపప్పు( Almond ), 6 నానబెట్టిన జీడిపప్పు, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి( Cardamom Powder ) , అరకప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

ఆపై అందులోనే రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము( Grate Jaggery ) మరియు మరో అరకప్పు పాలు పోసుకుని మరోసారి గ్రైండ్ చేసుకుంటే మ‌న క్యారెట్ అల్మండ్‌ జ్యూస్ రెడీ అవుతుంది.

రోజుకు ఒక గ్లాస్ చొప్పున నిత్యం ఈ జ్యూస్ ను తీసుకోవాలి. """/" / క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది.

ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది.విట‌మిన్ ఎ( Vitamin A ) అనేది కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకం.

ప్రపంచంలోని అంధత్వానికి ప్రధాన కారణమైన కంటిశుక్లం మరియు మచ్చల క్షీణత ఏర్పడకుండా విటమిన్ ఎ నివారిస్తుంది.

అలాగే బాదంపప్పు విటమిన్ ఇ యొక్క ప్రధాన మూలం.విట‌మిన్ ఇ అనేది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా ప‌ని చేస్తుంది.

హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కళ్ళ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.జీడిపప్పులో జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.

ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.పాల ఉత్పత్తుల్లో విటమిన్ ఎ మ‌రియు జింక్ ఉంటాయి.

ఇవి మంచి కంటి చూపును నిర్వహించడానికి తోడ్ప‌డ‌తాయి.మ‌రియు జింక్, విటమిన్ ఎ పోష‌కాలు కార్నియాను సైతం ర‌క్షిస్తాయి.

రామ్ చరణ్ ఆ దర్శకుడిని నెగ్లేట్ చేశాడా..?