ఈ గింజలను పొడి చేసి రోజూ తీసుకుంటే షుగర్ లెవెల్స్ దెబ్బకు కంట్రోల్ అవుతాయి!
TeluguStop.com
మధుమేహం( Diabetes ).మనలో చాలా మందిని వేధించే దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి.
అయితే మధుమేహం ఉన్నవారు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి ముప్పతిప్పలు పడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కలోంజి సీడ్స్ మీకు అద్భుతంగా సహాయపడతాయి.
ఈ గింజలను పొడి చేసి రోజూ తీసుకుంటే షుగర్ లెవెల్స్ దెబ్బకు కంట్రోల్ అవుతాయి.
అలాగే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందుతారు.మరి ఇంతకీ కలోంజి సీడ్స్( Kalonji Seeds ) ను ఎలా తీసుకోవాలి.
? అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు కలోంజి గింజలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
అలా వేయించుకున్న గింజలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకొని స్టోర్ చేసుకోవాలి.
ఈ కలోంజి సీడ్స్ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.
ఈ విధంగా రోజుకు ఒకసారి కనుక చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్( Blood Sugar Levels ) ను కంట్రోల్ చేయడానికి కలోంజి సీడ్స్ గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.
"""/" /
అలాగే నిత్యం కలోంజి గింజల పొడిని వాటర్ లో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
గ్యాస్, అజీర్తి, మలబద్ధకం( Gas, Indigestion, Constipation ) వంటి సమస్యలు వేధించకుండా ఉంటాయి.
అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ గింజలు ఒక వరం అని చెప్పుకోవచ్చు.
ఈ గింజల్లో ఫైబర్ తో పాటు వెయిట్ లాస్ కు సహాయపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
నిత్యం ఈ గింజల పొడిని తీసుకుంటే శరీరంలో క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి.
సూపర్ ఫాస్ట్ గా మీరు వెయిట్ లాస్ అవుతారు. """/" /
అంతేకాదు కలోంజి సీడ్స్ ను పొడి చేసుకుని తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంధి( Thyroid ) పనితీరు మెరుగ్గా సాగుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా మారుతుంది.చర్మ సౌందర్యానికి కూడా ఈ గింజలు ఉపయోగపడతాయి.
ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి.
చర్మం ఎల్లప్పుడూ నిగారింపుగా యవ్వనంగా సైతం మెరుస్తుంది.
ఈ న్యాచురల్ ఫేస్ వాష్‌ను వాడితే మొటిమలు, మచ్చలు లేని చర్మం మీసొంతం!