సమ్మర్ లో ఆరోగ్యానికి అండగా నిలిచే సగ్గుబియ్యం.. ఇలా తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్!

సమ్మర్ స్టార్ట్ అయ్యింది.ఎండలు మెల్లమెల్లగా ఊపందుకుంటున్నాయి.

దేశంలో పలుచోట్ల మార్చి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.ఈ సీజన్ లో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం.

లేకుంటే సన్ స్ట్రోక్, డిహైడ్రేషన్, హార్ట్ ఎటాక్ తదితర ప్రమాదకరమైన సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు పెరుగుతాయి.

అయితే సమ్మర్ లో ఆరోగ్యానికి అండగా నిలిచే ఆహారాల్లో సగ్గుబియ్యం ముందు వరుసలో ఉంటుంది.

అందులోనూ ఇప్పుడు చెప్పబోయే విధంగా సగ్గుబియ్యాన్ని తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం సగ్గుబియ్యాన్ని ఎలా తీసుకుంటే సమ్మర్ లో ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుందో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని ఒక గ్లాస్ వాటర్ లో వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీటితో సహా వేసుకోవాలి.ఇప్పుడు స్పూన్ తో తిప్పుకుంటూ ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ మరియు చిటికెడు కుంకుమ పువ్వు వేసి చిన్న మంటపై మరో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి.

"""/" / ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఈ సగ్గుబియ్యం మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ ఫ్రెష్ సపోటా జ్యూస్ లేదా కర్బూజ జ్యూస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి తాగేయడమే.

ఈ విధంగా సమ్మర్ లో ప్రతిరోజు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.సన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారు.

గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.

రోజంతా యాక్టివ్ గా ఉంటారు.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.

వెయిట్ లాస్ అవుతారు.మరియు శరీరంలో అధిక వేడి సైతం తొలగిపోతుంది.

చిరంజీవి కోసం రంగంలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్.. సెంటిమెంట్ ప్రకారం సినిమా హిట్టేనా?