వర్షాకాలంలో పైనాపిల్ ను ఈ విధంగా తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం!

ప్రస్తుత వర్షాకాలంలో విరివిరిగా దొరికే పండ్లలో పైనాపిల్( Pineapple ) ఒకటి.పులుపు, తీపి రుచులను కలగలిసి ఉండే పైనాపిల్ పోషకాలకు పవర్ హౌస్ లాంటిది.

అందువల్ల ఆరోగ్యపరంగా పైనాపిల్‌ అనేక ప్రయోజనాలు చేకూరుతుంది.ముఖ్యంగా పైనాపిల్ ను వర్షాకాలంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు తొక్క చెక్కేసిన పైనాపిల్ పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము మరియు ఒక గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ లో పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం(lemon Juice ) మిక్స్ చేసి సేవించాలి.

ఈ విధంగా పైనాపిల్ జ్యూస్ ను తయారు చేసుకుని వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

"""/" / పైనాపిల్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్ప‌లంగా ఉంటాయి.ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మరియు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.పైనాపిల్‌ లో అధిక మొత్తంలో పొటాషియం మరియు తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది.

హైపర్‌ టెన్షన్‌ తో బాధపడేవారు పైన చెప్పిన విధంగా పైనాపిల్ ను తీసుకుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది.

పైనాపిల్‌ లో బ్రోమెలైన్, డైటరీ ఫైబర్ ఉంటాయి.ఇవి మంచి జీర్ణక్రియకు సహాయపడతాయి.

"""/" / అలాగే క్యాన్సర్ కు దూరంగా ఉండాలి అనుకుంటే పైన చెప్పుకున్న విధంగా పైనాపిల్ జ్యూస్‌ను చేసుకుని తీసుకోండి.

పైనాపిల్ జ్యూస్ సెల్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది.క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.

పైనాపిల్ లో కాల్షియం మరియు మాంగనీస్ మెండుగా ఉంటాయి.ఇవి ఎముకలు దంతాలను దృఢంగా ఉంచుతాయి.

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే ఈ ఎంజైమ్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.

మరియు బ్యాక్టీరియాను చంపుతుంది.కాబట్టి జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పైనాపిల్ జ్యూస్ ను తప్పక తెలుసుకోండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై22, సోమవారం 2024