ఏండ్లు గడుస్తున్నా పూర్తికాని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో చింతలపాలెం-మేళ్లచెరువు( Chinthalapalem-Mellacheruvu ) ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏళ్ల తరబడి నత్తనడక సాగడంపై సీపీఐ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్తేల నారాయణరెడ్డి ( Ustela Narayana Reddy )మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ప్రజల రవాణా అస్తవ్యస్తంగా తయారైందన్నారు.
అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డుపై ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదని,చింతలపాలెం-మేళ్లచెరువు రహదారిని వెంటనే బీటీ రోడ్డుగా మార్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పక్కనే ఏర్పాటు చేసిన మట్టి రోడ్డుపై పెద్దపెద్ద గుంతల్లో వర్షం నీళ్లు నిలిచి ప్రమాదకరంగా మారడంతో బైక్,ఆటో లాంటి వాహనాలు గుంతల్లో చిక్కుకోని నరకం అనుభవిస్తున్నారని,అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
అలియా భట్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!