తక్కువ ఖర్చుతో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో నిర్మాణం..: కేటీఆర్
TeluguStop.com
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ క్రమంలో నియోజకవర్గంలో మొత్తం 40 వేల మందికి పట్టాలు అందించినట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా నగరంలో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.వచ్చే వందేళ్లకు తగ్గట్లుగా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.
తక్కువ ఖర్చుతో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఇస్నాపుర్ నుంచి పెద్ద అంబర్ పేట్ వరకు మెట్రో సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
మొత్తం 314 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించబోతోందన్న మంత్రి కేటీఆర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!