రాజకీయ శవాలపై కేసీఆర్ రాజసౌధం నిర్మాణం..: కూనంనేని

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్ రాజకీయ ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు.అయితే రాబోయే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని కూనంనేని వెల్లడించారు.అవసరం వస్తే దగ్గరికి వస్తారన్న ఆయన అవసరం తీరిపోగానే వదిలేస్తారా అని ప్రశ్నించారు.

కేసీఆర్ కు విలువలు కాదు కావాల్సిందని విమర్శించిన కూనంనేని రాజకీయాలు మాత్రమే కావాలని ఎద్దేవా చేశారు.

రాజకీయ శవాలపై కేసీఆర్ రాజసౌధం నిర్మించుకున్నారని మండిపడ్డారు.ఐదు జిల్లాల్లో లెఫ్ట్ ప్రభావం ఉంటుందన్నారు.

తెలంగాణలో 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐ బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

గేమ్ చేంజర్ ప్లాప్ అవ్వడానికి శంకర్, రామ్ చరణ్ ఇద్దరిలో కారణం ఎవరు..?