చందుర్తి – మోత్కురావుపేట రోడ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కురావుపేట వరకు ప్రగతిలో ఉన్న రోడ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.

సోమవారం చందుర్తి - మోత్కురావుపేట వరకు నిర్మిస్తున్న రోడ్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి విప్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు.

అటవీ శాఖ, ఆర్&బి శాఖ అధికారులు రోడ్ నిర్మాణానికి చేపడుతున్న చర్యలను ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ కు వివరించారు.

6.5 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని ఆర్&బి ఏఈ వివరించారు.

3.4 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం కోసం అటవీ శాఖ నుండి అనుమతి రావాలని పేర్కొన్నారు.

నిర్మాణానికి సంబంధించి అటవీ శాఖ నుండి అనుమతి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారిని ప్రభుత్వ విప్ ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలో రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.ఈ సందర్శనలో అటవీ శాఖ అధికారి బాలామణి, ఆర్డీఓ రాజేశ్వర్, ఆర్&బి ఏఈ సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో