సిరిసిల్ల జిల్లా ప్రాజెక్టులో 31 అంగన్వాడి కేంద్రాల భవన నిర్మాణాలు మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన అంగన్వాడి కేంద్రానికి సి.

డి.పి.

ఓ గుర్రం ఉమారాణి, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సి.డి.

పి.ఓ గుర్రం ఉమారాణి మాట్లాడుతూ.

సిరిసిల్ల జిల్లా ప్రాజెక్టు తరఫున 31 అంగన్వాడి కేంద్రాల భవన నిర్మాణానికి ఒక్కో అంగన్వాడికి 12 లక్షల నిధులు మంజూరు అయ్యాయని (8 లక్షలు MGNREGS,2 లక్షలు 15 వ ఆర్థిక సంఘం నిధులు,2 లక్షలు WD,CW నిధులు), నిధులు మంజూరుకు సహకరించిన కేకే మహేందర్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, పై అధికారులకు సి.

డి.పి.

ఓ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల సూపర్వైజర్ నాంపల్లి రాజేశ్వరి, ఎమ్మార్వో రామచంద్రం, డిప్యూటీ ఎమ్మార్వో బొబ్బిలి సత్యనారాయణ, కార్యదర్శి పంతులవారి సంతోష్ స్పెషల్ ఆఫీసర్ సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,తాజా మాజీ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సాహెబ్, ఎల్లారెడ్డిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం-గౌస్ బాయ్, గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ- తిరుపతి పటేల్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల పద్మారెడ్డి, మాజీ అధ్యక్షులు కొంగరి కిష్టారెడ్డి, నంది కిషన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొత్తూరి శివకుమార్ గౌడ్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ సయ్యద్ సాదియా, అంగన్వాడీ టీచర్ బొప్పవరం పద్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుడిది రాజేందర్, మేడిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

వీడియో: ఈ డోర్ ఎంత బలంగా ఉందో.. ఏనుగులు తోసినా అంగుళం కదలదట..!!