రోజు ఉదయం ఈ డ్రింక్ ను తాగితే మలబద్ధకం దెబ్బకు పరార్ అవుతుంది!
TeluguStop.com
మలబద్ధకం.వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.
చాలా మంది మలబద్ధకం ను నిర్లక్ష్యం చేస్తుంటారు.దీని కారణంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్ టెన్షన్, పైల్స్ తదితర సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి.
అలాగే మలబద్ధకం కారణంగా ఆకలి మందగిస్తుంది.దాంతో ఏం తినాలన్నా వెనకడుగు వేస్తుంటారు.
ఫలితంగా శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు అందకుండా పోతాయి.అందుకే మలబద్ధకం సమస్యను నివారించుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.
"""/" /
మీరు కూడా మలబద్దకంతో బాధపడుతున్నారా? ఆ సమస్య నుంచి బయటపడేందుకు మందులు వాడుతున్నారా.
? అయితే సహజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ డ్రింక్ ను రోజు ఉదయం తీసుకుంటే ఎలాంటి మలబద్ధకం అయినా దెబ్బకు పరార్ అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం మలబద్ధకం సమస్యను నివారించే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా అంగుళం అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి వాటర్ తో కడిగి సన్నగా తురుముకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, ఎనిమిది నుంచి పది ఫ్రెష్ పుదీనా ( Spearmint )ఆకులు, వన్ టేబుల్ స్పూన్ సోంపు( Fennel ) వేసి కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి.
"""/" /
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ను మిక్స్ చేసి సేవించాలి.
ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ను తీసుకుంటే జీర్ణవ్యవస్థ( Digestive System ) పనితీరు మెరుగ్గా మారుతుంది.
మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.ఎలాంటి మందులు వాడక్కర్లేదు.
ఈ డ్రింక్ ను తీసుకుంటే సహజంగానే మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
పైగా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.
బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.ఇమ్యూనిటీ సిస్టం సైతం బూస్ట్ అవుతుంది.
శ్రీకాంత్ ఓదెల చిరంజీవి సినిమాతో భారీ సక్సెస్ కొడతాడా..?