రోజు ఉదయం ఈ పొడిని వాటర్ లో కలుపుకుని తాగారంటే మలబద్ధకం మీ వంక కూడా చూడదు!

మలబద్ధకం.( Constipation ) వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని కలవర పెట్టే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఒకటి.

ప్రేగు కదలికలు తక్కువగా ఉన్నప్పుడు మరియు మలం విసర్జించటం కష్టంగా మారినప్పుడు మలబద్ధకం ఏర్పడుతుంది.

ఫైబర్ ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, ఒత్తిడి, పెద్ద మొత్తంలో పాలు లేదా చీజ్ తీసుకోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం, పలు రకాల మందులు వాడకం తదితర అంశాలు మలబద్దకానికి కారణం అవుతుంటాయి.

మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేస్తే శరీరం రోగాల పుట్ట అవుతుంది.అందువల్ల మలబద్ధకం సమస్యను వదిలించుకోవడం చాలా ముఖ్యం.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.రోజు ఉదయం ఈ పొడిని వాటర్ లో కలుపుకుని తాగారంటే మలబద్ధకం మీ వంక కూడా చూడదు.

మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు,( Coriander Seeds ) రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర,( Cumin ) రెండు టేబుల్ స్పూన్లు సోంపు, రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్‌, రెండు టేబుల్ స్పూన్లు మెంతులను విడివిడిగా వేయించి చల్లారబెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, అవిసె గింజలు, సోంపు, కలోంజి సీడ్స్ ను తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. """/" / ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి నేరుగా సేవించాలి.

ఆపై అరగంట పాటు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.ఈ విధంగా ప్రతినిత్యం చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

కాబట్టి ఎవరైతే మలబద్ధకం సమస్యతో తరచూ బాధపడుతున్నారో తప్పకుండా వారు పైన చెప్పిన పొడిని తయారు చేసుకుని తీసుకోండి.

వింటర్ లోనూ సూపర్ గ్లోయింగ్ అండ్ సాఫ్ట్ స్కిన్ ను పొందాలనుకుంటే ఇది ట్రై చేయండి!