క్లారిఫికేషన్ లెటర్‌లో తిండి గురించి రాసిన కానిస్టేబుల్.. చదివితే నవ్వుతారు!

ఉత్తరప్రదేశ్‌లో ఒక నవ్వు పుట్టించే సంఘటన చోటు చేసుకుంది.సుల్తాన్‌పూర్‌లో ట్రైనింగ్ సమయంలో ఒక హెడ్ కానిస్టేబుల్ నిద్రపోతూ ఉన్నతాధికారులకు పట్టుబడ్డారు.

దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులు అతన్ని కోరారు.కాగా అతను రాసిన క్లారిఫికేషన్ లెటర్ ఇప్పుడు అందరి చేత నవ్వులు పూయిస్తోంది.

ఈ క్లారిఫికేషన్ లేఖకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే.

కానిస్టేబుల్ రామ్ షరీఫ్ యాదవ్ సోమవారం తన ట్రైనింగ్ సమయంలో నిద్రపోయారు.అతని కమాండర్ ఈ చర్యను తీవ్ర నిర్లక్ష్యానికి సంకేతమని పిలుస్తూ దీనిపై వివరణ కోరారు.

దీనితో ఈ పోలీసు తన వివరణ లేఖలో "నేను లక్నో నుంచి శిక్షణ కోసం పిటిసి దాదుపూర్‌కు బయలుదేరాను.

ఇక్కడకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను.సరైన ఆహారం లేకపోవడంతో, నా కడుపు నిండలేదు.

అందువల్ల, మరుసటి రోజు ఉదయం నేను 25 రోటీలు, ఒక ప్లేట్ అన్నం, రెండు గిన్నెల పప్పు, ఒక గిన్నె కూరగాయలు లాగించాను.

ఈ ఫుడ్డు నన్ను నీరసంగా నిద్రపోయేలా చేసింది." అని పేర్కొన్నారు.

"""/"/ యాదవ్ క్షమాపణలు చెప్పి, ఇకపై అలా జరగదని సీనియర్ అధికారికి హామీ ఇచ్చారు.

ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు బాగా నవ్వుతున్నారు.25 చపాతీలు తిన్నారా? ఏ విషయం కూడా క్లారిఫికేషన్ లెటర్లు ఇచ్చారంటే మీరు గ్రేట్ సార్ అని కామెంట్ చేస్తున్నారు.

బహుశా ఇలాంటి వివరణ ఏ పోలీసు అధికారి రాసి ఉండదేమో అని ఇంకొందరు నవ్వుకుంటున్నారు.

ఈ లెటర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

జక్కన్న, ఆయన భార్యకు అరుదైన గౌరవం.. ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!