ప్రొఫెషినల్ సింగర్ వలె పాడుతున్న కానిస్టేబుల్.. కావాలంటే చూడండి!

సోషల్ మీడియా బాగా విస్తరించడం వలన ప్రపంచం నలుమూలలా వున్నా టాలెంటెడ్ పీపుల్ బయట పడుతున్నారు.

మనచుట్టూ వున్న కొందరిలో ఏదోఒక టాలెంట్ ఇమిడి ఉంటుంది.అయితే పరిస్థితుల కారణాలవలన వారు జీవన చట్రంలో ఇరుక్కుపోయి, ఏదో చిన్న చితక పనులకు పరిమితం అయిపోతూ తమ కాలాన్ని వెళ్లబుచ్చుతారు.

అయితే ఇపుడు సోషల్ మీడియాని ఉపయోగించుకొని కొంతమంది బయటకి వస్తున్నారు.తాజాగా అలాంటి వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం.

మనం చూసుకుంటే, పాకిస్తాన్‌కు చెందిన ‘కోక్’ స్టూడియో పాట‌లు యూట్యూబ్‌లో కొంతకాలంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ‘ప‌సూరి’ అనే పాట ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.అలాగే, ‘ఆఫ్రీన్ ఆఫ్రీన్’ పాట‌కూడా మంచి ట్రెండింగ్‌లో ఉంది.

ఈ పాట‌ను రహత్ ఫతే అలీ ఖాన్‌, మోమినా ముస్తేసన్ అనే సింగర్స్ పాడారు.

ఈ పాట‌కు యూట్యూబ్‌లో 360 మిలియ‌న్ల వ్యూస్ రాగా, లెక్కలేనన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి.

కాగా, ఈ పాట‌ను ITBP (ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్) కానిస్టేబుల్ అయినటువంటి విక్రంజీత్‌సింగ్ అద్భుతంగా పాడారు.

ఆ గొంతుకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.ఈ వీడియోను ‘సుమిత్ చౌద‌రి’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

ఈ 1.37 నిమిషాల ఈ క్లిప్‌లో విక్రంజీత్‌సింగ్ అద్భుతంగా ఆలపించారు.

అలాగే మ‌రో కానిస్టేబుల్ పక్కనే గిటార్ వాయించడం మనం ఇందులో చూడవచ్చు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

విక్రంజీత్‌సింగ్ పాట నెటిజ‌న్లను అమితంగా ఆక‌ట్టుకున్న‌ది.ఈ నేపథ్యంలో నెటిజన్లు అనేకమంది స్పందిస్తున్నారు.

‘విక్రంజీత్‌సింగ్ చాలా చ‌క్క‌గా పాడుతున్నాడు.ఇండియ‌న్ ఐడ‌ల్‌లో ఉండాల్సిన వ్య‌క్తి’ అని ఓ వ్యక్తి కామెంట్ చేయడం మనం చూడవచ్చు.

మీరు కూడా ఆ టాలెంట్ ని చూసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం.'.

యంగ్ డైరెక్టర్స్ తో చిరంజీవి సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే..?