కుట్రపూరితంగానే ఐటీ దాడులు.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
TeluguStop.com
కుట్రపూరితంగానే తనపై ఐటీ అధికారుల దాడులు జరిగాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.
మూడు రోజులపాటు అధికారులు తనిఖీల పేరుతో కాలయాపన చేశారని తెలిపారు.విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయనడం అవాస్తవమని పైళ్ల శేఖర్ రెడ్డి వెల్లడించారు.
అయితే అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.కాగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సతీమణి వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ సంస్థపై కూడా అధికారులు ఆరా తీశారు.
అయితే ఈ మూడు రోజుల తనిఖీలలో భాగంగా పలు కీలక పత్రాలతో పాటు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
PMEGP లోన్‌కు అప్లై చేసుకున్నారా? లేదంటే ఇలా చేస్తే సరి!