బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేశారు..: కేసీఆర్
TeluguStop.com
గజ్వేల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేను, సీఎంను చేసిన గడ్డ గజ్వేల్ అని తెలిపారు.
గజ్వేల్ గడ్డ తనను ఈ స్థాయికి తెచ్చిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.గజ్వేల్ తన గౌరవాన్ని పెంచిందన్న ఆయన గజ్వేల్ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు.
గజ్వేల్ మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్ వస్తోందని చెప్పారు.అయితే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటోందన్న కేసీఆర్ అప్పుడే కదా ఎమర్జెన్సీ వచ్చిందని గుర్తు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేశారని ఆరోపించారు.కానీ ఎవరెన్నీ కుట్రలు చేసిన మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా మొదటి షెడ్యూల్ జరిగేది అక్కడేనా..?