ప్రజాపాలన అంతం కావాలని కుట్రలు..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కారు పాడైపోయి షెడ్ కు పోయిందన్న రేవంత్ రెడ్డి ఇకపై దాన్ని తుక్కుకు వేయాల్సిందేనని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని కేసీఆర్( KCR ) అంటున్నారని, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే దమ్ముంటే కాంగ్రెస్ ను టచ్ చేసి చూడాలన్నారు.కాంగ్రెస్ హైటెన్షన్ వైరు లాంటిదని, ముట్టుకుంటే మాడి మసై పోతారని రేవంత్ రెడ్డి తెలిపారు.

"""/" / కాంగ్రెస్ ఎలా ఖాళీ అవుతుందో తాను చూస్తానని చెప్పారు.

మీలాంటోళ్లను తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.కేసీఆర్, మోదీ చీకట్లో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్, మోదీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారా అని ప్రశ్నించారు.ప్రజాపాలన అంతం కావాలని కుట్రలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

గజిని చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం.. నయన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!