బక్రీద్ పండగ కోసం ఏర్పాట్ల పరిశీలన.

ఈ నెల 17 సోమవారం జరిగే ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ పండుగ ( Bakrid Festival)కోసం ఎల్లారెడ్డి పేట(Ellareddy Peta)లో గల ఈద్గా లో చేయవలసిన ఏర్పాట్లను స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ (MPTC Is A Balaraju Yadav)పరిశీలించారు.

ఏపుగా పెరిగిన చెట్లను తొలగించాలని ఈద్గా వద్ద పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ గ్రామ ప్రత్యేకాధికారికి విన్నవించగా ఆయన ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ శానిటేషన్ ఇంచార్జీ ఆంజనేయులు తో కలిసి స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ లు కలిసి పరిశీలించారు.

ఏపుగా ఎదిగిన చెట్లను తొలగించడం కోసం గ్రామ పంచాయతీ సిబ్బందిని నియమించాలని రెండు రోజుల లోపు చెట్లను తొలగించాలని ఒగ్గు బాలరాజు యాదవ్ గ్రామ ప్రత్యేకాధికారి సత్తయ్య ను పంచాయతీ కార్యదర్శి దేవరాజు ను కోరారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు దర్వేష్, లాల్ మహమ్మద్, గౌస్, ఖాజా , గ్రామ పంచాయతీ శానిటేషన్ ఇంచార్జీ ఆంజనేయులు ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే సినిమా ఫ్లాపేనా… ఇదేం లాజిక్?