చామంతి పూల సాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడి కోసం మెళుకువలు..!

పూలను ( Flowers ) వివిధ రకాల పూజా కార్యక్రమాలకు, శుభకార్యాలకు, పండగలకు ఉపయోగిస్తారు కాబట్టి ఎప్పుడూ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది.

చామంతి అనేది ఒక శీతాకాలపు పంట.ఈ సాగులో మెలకువలు తెలుసుకొని పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

చామంతి పంటను( Chrysanthemum ) జూలై నుంచి ఆగస్టు వరకు నాటుకోవచ్చు.పండుగల సీజన్ ను దృష్టిలో ఉంచుకొని నాటుకోవాలి.

అయితే ఒకేసారి కాకుండా 15 నుంచి 20 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు దశలుగా నాటితే పూలను ఎక్కువ కాలం పొందే అవకాశం ఉంటుంది.

చామంతి మొక్కలను( Chamanthi Plants ) ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 50 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 50 కిలోల పోటాష్ ఎరువులు వేసుకొని కలియ దున్నుకోవాలి.

మొక్క ఎదుగుదశలో ఉన్నప్పుడు ప్రతి 20 రోజులకు ఒకసారి తప్పకుండా సూక్ష్మ పోషక మిశ్రమాలను స్ప్రే చేస్తే పంట దిగుబడి పెరుగుతుంది.

పంట విత్తిన మొదటి నెలలో వారానికి రెండుసార్లు, ఆ తర్వాత వారానికి ఒకసారి నీటి తడిని అందించాలి.

"""/" / నారు నాటిన నాలుగు వారాల తర్వాత చామంతి మొక్కల తలలు తుంచి వేయాలి.

శీతాకాలం( Winter ) ఆరంభంలోనే పూలను సేకరిస్తే మొక్కలను వెనుకకు కత్తిరించి ఎరువులు వేసుకుంటే 30 రోజుల్లో మొక్కలు మళ్లీ పెరిగి పూతకొస్తాయి.

పూల పూత కాస్త ఆలస్యంగా రావాలి అనుకుంటే 100పీపీయం నాఫ్తాలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గ దశ కంటే ముందుగా పిచికారి చేయాలి.

"""/" / పూల పూత త్వరగా రావాలి అనుకుంటే 100పిపియం జిబ్బరిల్లిక్ ఆమ్లాన్ని పిచికారి చేస్తే పూత త్వరగా వస్తుంది వస్తుంది.

ఇక చామంతిని వేరే ఇతర పంటలతో పంట మార్పిడి చేస్తే.చామంతి పంట( Chrysanthemum Crop ) వేరు కుళ్ళు బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు.

పూత సమయంలో పోటాష్ ఎరువులు మరియు సూక్ష్మధాతు మిశ్రమాలను మొక్కలకు అందిస్తే పూల నాణ్యత బాగా ఉండడంతో పాటు దిగుబడి పెంచుకోవచ్చు.