ఏపీలో ఉనికి కోసం కాంగ్రెస్ ఆరాటం.. ఫలితం శూన్యమంటున్న..!?

సర్క్యులర్ పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్( Congress ) ప్రస్తుతం ఏపీలో ఉనికి కోసం ఆరాటపడుతోంది.

నోటాకు ఉన్న విలువ హస్తం పార్టీకి లేదంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత ఏంటనేది.

దేశంలో ఒకప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ అంటే ఎంతో పేరుతో పాటు ప్రజల్లో ఎంతో అభిమానం కనిపించేది.

కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు.రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది.

దీంతో ప్రజలు హస్తం పార్టీని ఇసడించుకునే పరిస్థితి వచ్చింది.భవిష్యత్ లో కూడా కోలుకునే అవకాశం లేకుండా చేశారు.

ఒకప్పుడు దేశంలోని దాదాపు 90 శాతం రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది.ఢిల్లీ( Delhi ) నుంచి గల్లీ వరకూ కాంగ్రెస్ అంటేనే ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం.

పార్టీకి చెందిన నేతలు మొదలు పార్టీ క్యాడర్ వరకు ఎంతో గర్వంగా కాంగ్రెస్ కండువాను మెడలో వేసుకుని తిరిగేవారు.

స్వార్థ రాజకీయాలను చేయడంతో ఎక్కడా కాంగ్రెస్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేదని ప్రజలు భావిస్తున్నారట.

దీంతో కొన్ని రాష్ట్రాల్లో కుంటుతూ నడుస్తోన్న కాంగ్రెస్ ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా ఉనికిని కూడా కోల్పోయింది.

"""/" / కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కాలర్ ఎగరేసినా నేతలందరూ 2019 ఎన్నికల్లో మట్టికరిచారన్న సంగతి అందరికీ తెలిసిందే.

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి( Dr.YS Rajasekhar Reddy ) మరణం తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరు ప్రజలు సైతం అంగీకరించలేకపోయారు.

తండ్రి దూరమైన బాధలో ఉన్న వైఎస్ జగన్ పై కర్కశంగా తన వైఖరిని ప్రదర్శించిన హస్తం పార్టీనీ ఏపీ ప్రజలు నేలమట్టం చేశారని చెప్పుకోవచ్చు.

అందుకే ఈ రోజు వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందనే విషయాన్ని కూడా అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

"""/" / గతంలో కేంద్ర మంత్రులుగా రాణించిన నేతలు కూడా 2014 మరియు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి దారుణంగా ఓటమి చెందారు.

కనీసం పది వేల ఓట్లు కూడా సాధించలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్, ఆ పార్టీ నేతలపై ప్రజలకున్న భావన.

కేంద్రమంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడ నియోజకవర్గంలో బరిలోకి దిగితే 8,640 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఆయన ఒక్కరే కాదు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9,585 ఓట్లు వచ్చాయి.

సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ ( Shailajanath )సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1,384 ఓట్లు వచ్చాయి.

అదే ప్రాంతంలో నోటాకు 2,340 ఓట్లు రావడం విశేషం.అంటే నోటాకంటే కూడా కాంగ్రెస్ తక్కువ ఓట్లు వచ్చాయి.

వీరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి.కొన్ని చోట్ల అయితే కాంగ్రెస్ అభ్యర్థులకు కనీస మర్యాద కూడా దక్కలేదు.

పార్టీ అగ్రనేతలుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా కూడా ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రాదు.

తిరిగి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేదని ప్రజలు తేల్చి చెబుతున్నారు.అప్పుడే కాదు ఇప్పుడు అయినా.

ఇంకెప్పుడైనా సరే ఎంత గొప్ప నేతలు వచ్చి కాంగ్రెస్ లో చేరినా ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు.

ఇకపై ఎప్పటికీ రాదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

నా ఎదుగుదలకు కారణం ఆయనే.. వైరల్ అవుతున్న బన్నీ షాకింగ్ కామెంట్స్!