యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై కాంగ్రెస్ సమీక్ష
TeluguStop.com
యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది.కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం కానుంది.
టెన్ జన్ పథ్ లో సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు చర్చించనున్నారు.
కాగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కానున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వైఖరిపై నాయకులు చర్చించనున్నారని సమాచారం.
తప్పించుకున్న సింహం.. ఇంట్లోకి వచ్చి ఆ బాలికను ఎలా చంపేసిందో తెలిస్తే?