రేవంత్ చేసిన ఈ పనికి కాంగ్రెస్ కార్యకర్తలు ఖుషీ...

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలు వెన్నుముక.కార్యకర్తల బలం లేకపోతే ఏ పార్టీ అయినా జనం లోకి వెళ్లడం సాధ్యం కాని పని.

ఇప్పటి వరకు పార్టీల గురించి ప్రాణాలకు తెగించి కొట్లాడిన వారున్నారు.కాని నాయకులు మాత్రం స్వంత ఎజెండాతోటి వెళ్తుంటారు.

కార్యకర్తకు, జెండా మోసిన వారికి ఎప్పటికి గుర్తింపు అనేది ఉండదు.దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు.

కాని ఏ పార్టీ అయినా కార్యకర్తలను గుర్తిస్తూ, వాళ్ళు పార్టీకి చేసిన సేవలు గుర్తుపెట్టుకొని వాళ్ళను ప్రోత్సహిస్తే ప్రజాభిమానాన్ని పొందడం ఏ మాత్రం పెద్ద విషయం కాదు.

అలా నాయకుడు తన కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడితే కార్యకర్తలకు ఒక భరోసా వస్తుంది.

కార్యకర్తలు కూడా ఖుషీగా ఉంటారు.మా నాయకుడు మాకు అండగా ఉంటున్నారు అని ఇంకా సదరు నాయకుని నాయకత్వంలో పని చేయడానికి ఇష్టపడతారు.

తాజాగా రేవంత్ ఇంటి దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ హైరానా జరిగిన విషయం తెలిసిందే.

అయితే ఈ సమయంలో అక్కడే పోలీసులు ఉండటంతో పెద్ద గొడవ అనేది ఆగింది.

పోలీసులు ఇరు వర్గాలను వారించే ప్రయత్నం చేసారు.అయితే ఆ తరువాత రేవంత్ వర్గం వారిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.

"""/"/ అయితే వెంటనే రేవంత్ రెడ్డి కేసు నమోదైన పోలీస్ స్టేషన్ కు వెళ్లి టీఆర్ఎస్ కార్యకర్తలు నా ఇంటిపైకి దాడికి వస్తే మా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి, టీఆర్ఎస్ కార్యకర్తలను వదిలివేయడం ఎంత వరకు కరెక్ట్ అని పోలీసు అధికారులను నిలదీయడం జరిగింది.

కార్యకర్తలకు న్యాయం జరగడం కోసం రాష్ట్ర పీసీసీ చీఫ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం అన్నది కార్యకర్తల పట్ల వారి కున్న కమిట్ మెంట్ ఇది అని కాంగ్రెస్ కార్యకర్తలు ఖుషీ అవుతున్న పరిస్థితి ఉంది.

నో ప్రాబ్లమ్.. కాల్ మీ ఆంటీ.. వైరల్ అవుతున్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!