5..6..7 : వీటినే నమ్ముకున్న కాంగ్రెస్ ?

ఏపీలో ఏదో రకంగా పార్టీని బలోపేతం చేసి , కనీసం కొన్ని ముఖ్యమైన స్థానాల్లో అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్( Congress ) దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తోంది.

వై నాట్ ఏపీ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది .

ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలను నియమించారు.త్వరలోనే భారీ గా సభలు,  సమావేశాలు,  రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఏపీ తెలంగాణా విభజన తరువాత జనాల్లో కాంగ్రెస్ పై వ్యతిరేఖత ఉండడం, ఉనికే ప్రశ్నార్థకంగా మారడంతో పార్టీలోని కీలక నాయకులు , కార్యకర్తలు ఇతర పార్టీలో చేరిపోయారని, ఇప్పుడు వారందరినీ వెనక్కి రప్పించడంతోపాటు ,ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను తమ పార్టీలో చేర్చుకుని మరింతగా బలోపేతం కావాలనే విషయంపై కాంగ్రెస్ దృష్టి సారించింది.

ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనాల్లో కాంగ్రెస్ పై ఆదరణ పెంచుకోవడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది.

దీనిలో భాగంగానే అనేక ఎన్నికల హామీలను ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. """/" / ముఖ్యంగా కర్ణాటకలో( Karnataka ) కాంగ్రెస్ 5 గ్యారంటీ హామీలను జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి సక్సెస్ అయ్యింది.

ఆ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీలను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో  ఆసక్తి పెరగడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ నమ్ముతోంది.

ఇప్పుడు ఏపీలో గెలిచేందుకు ఏడు గ్యారంటీలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.ఏడు గ్యారెంటీ ల( Seven Guarantees ) పేరుతో ఎన్నికల హామీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది .

ఇదే విషయాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రద్దరాజు వెల్లడించారు.ఏడు గ్యారెంటీ లతో పాటు వై నాట్ కాంగ్రెస్ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని రుద్రరాజు చెబుతున్నారు.

"""/" / అలాగే ఏపీ వ్యాప్తంగా దశలవారీగా భారీ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని , ముందుగా ఒంగోలులో( Ongole ) సభ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత,  పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రకటించబోయే ఏడు గ్యారంటీలు ప్రజల్లో ఆసక్తిని పెంచడంతోపాటు , తమకు అధికారం తీసుకువస్తుంది అనే ఆశలతో ఏపీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?