కార్యకర్త కుటుంబానికి అండగా కాంగ్రెస్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవ౦ఛ గ్రామానికి చెందిన ఏనుగుల మల్లేశం (41)వారం రోజుల క్రితం గుండె పోటుతో మరణించడం జరిగింది.
ఆయనకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించి, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
ఇట్టి విషయాన్ని నియోజకవర్గ ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిచేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అద్యక్షుడు ప్రవీణ్ జె టోనీ గ్రామ శాఖ నాయకులు, మండల నాయకులతో పాల్గొనడం జరిగింది.
ఒకే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అన్న, తమ్ముడు, చెల్లి.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!