కాంగ్రెస్ టార్గెట్.. తెలంగాణ టూ ఏపీ ?

ప్రస్తుతం సౌత్ రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గట్టిగానే ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే కర్నాటకలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు తెలంగాణపై గట్టిగా దృష్టి పెట్టింది.

ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు.ప్రస్తుతం తెలంగాణ పరిస్థితులు చూస్తుంటే.

కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకున్నట్లు తెలుస్తోంది.అధికార బి‌ఆర్‌ఎస్ కు ధీటుగా ఓటు శాతం నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

దీంతో ఈసారి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదని అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు హస్తం నేతలు.

"""/" / ఇకపోతే తెలంగాణ లో విజయం ఏపీలో కూడా ప్రభావితం అవుతుందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.

నిజానికి కర్నాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో హస్తం పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో మైలేజ్ లేదు.

ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతుండేది.అయితే అనూహ్యంగా కర్నాటక( Karnataka )లో అధికారంలోకి వచ్చిన తరువాత సినీ మారిపోయింది.

తెలంగాణలో కూడా కాంగ్రెస్ జోరు పెరిగింది.ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడం, సొంత పార్టీలో కూడా నేతలు విభేదాలు పక్కన పెట్టి అందరూ ఒకే తాటిపైకి రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఫలితంగా కాంగ్రెస్ అనూహ్యంగా బలం పెంచుకుంది.అలాగే తెలంగాణలో కూడా విజయం సాధిస్తే.

ఆ ప్రభావం ఏపీపై కూడా పడుతుందనేది కొందరి అభిప్రాయం. """/" / ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉందనే విషయం కూడా చాలమందికి తెలియదు.

2014 తరువాత ఆ పార్టీ ఏపీలో నుంచి కనుమరుగైపోయింది.ఆ పార్టీకి సంబంధించిన నేతలు.

ఇతర పార్టీలలో స్థిరపడిపోయారు.అధిష్టానం కూడా ఏపీలో పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదు.

అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి రావాలంటే సౌత్ రాష్ట్రాలు చాలా కీలకం.

అందుకే ఎప్పుడు ఏపీపై కూడా స్పెషల్ ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ హైకమాండ్.తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి వస్తే ఇక పూర్తి ఫోకస్ ఏపీపైనే ఉంచాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఏపీలో బలోపేతం కోసం హస్తం పార్టీ ఎలాంటి వ్యూహాలను చేయబోతుంది ? నేతలను ఎలా ఆకర్షించబోతుంది అనేది ముందు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

మరి ఏపీ టార్గెట్ గా కాంగ్రెస్ ప్రణాళికలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి