కాంగ్రెస్ “స్ట్రాటజి”స్ట్.. దెబ్బేశాడా ?

ఏదైనా పార్టీకి గెలుపోటముల విషయంలో పోలిటికల్ వ్యూహాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.అందుకే రాజకీయ పార్టీలన్నీ వ్యూహకర్తలను నియమించుకొని వారి సలహాలు సూచనల మేరకే ఎన్నికల బరిలో నిలిస్తుంటాయి.

ఏపీలో 2019 ఎన్నికల టైమ్ లో ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) వ్యూహాలు వైసీపీకి ఏ స్థాయిలో ప్లేస్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ఇక పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ( All India Trinamool Congress )పార్టీ గెలుపులో కూడా ఈ స్ట్రాటజిస్ట్ పాత్ర ఎక్కువే.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.ఈ ఏడాది మే జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

"""/" / 214 సీట్లకు గాను ఒక్క కాంగ్రెస్ పార్టీనే 155 సీట్లు కైవసం చేసుకొని సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఆ పార్టీ ఈ స్థాయి విజయం సాధించడానికి కారణం ఆ పార్టీ వ్యూహకర్త సునిల్ కనుగోలు అమలు చేసిన వ్యూహాలే అనేది కొందరు విశ్లేశేషకులు చెప్పిన మాట.

దాంతో తెలంగాణలో కూడా మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ఇక్కడ కూడా సునిల్ కనుగోలునే( Sunil Kanugulu ) వ్యూహకర్తగా నియమించింది కాంగ్రెస్ పార్టీ.

ఇప్పటికే ఆయన వ్యూహాలతో హస్తం పార్టీ రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తోంది.ఇదిలా ఉంచితే నియోజిక వర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై ఇప్పటికే సర్వేలు చేయించిన సునిల్ కనుగోలు.

"""/" / ఆయా నియోజిక వర్గాలలో పార్టీ బలహీనంగా ఉందని, అక్కడి స్థానిక నేతల విషయంలో మార్పులు చేయాల్సి ఉంటుందని టి కాంగ్రెస్ కు సూచించరాట.

ఐతే సునిల్ ఇచ్చిన సర్వేల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాస్త భిన్నంగా ప్రవర్తిస్తునట్లు పోలిటియాల్ సర్కిల్స్ లో వినికిడి.

రేవంత్ రెడ్డి సన్నిహితులకు పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వాలని సునిల్ పై ఒత్తిడి పెంచుతున్నారట రేవంత్ రెడ్డి.

దీంతో అలా చేయడానికి ససేమిరా అంటున్న సునిల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు టాక్.

ఇప్పటికే ఆయన బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.ఒకవేళ సునిల్ కనుగోలు కాంగ్రెస్ కు గుడ్ బై చెబితే.

ఆ పార్టీకి గట్టి దెబ్బేనని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.మరి హస్తం పార్టీ సునిల్ ను వదులుకునేందుకు సిద్దంగానే ఉందా లేదా అనేది చూడాలి.

ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్… రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?