ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.ఈ మేరకు బీఆర్ఎస్ అసంతృప్త నేతలపై హస్తం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.

అసంతృప్తిలో ఉన్న మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచ్ లు, కౌన్సిలర్లపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే నల్గొండ మున్సిపాలిటీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, శశిధర్ రెడ్డితో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వడాన్ని ఈ ఇరువురు నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వేనేపల్లి చందర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

మేడమ్‌ను “సార్” అనేసింది.. అంతే యూఎస్ ఫ్లైట్ నుంచి గెంటేశారు..??