రాహుల్ గాంధీ క్షమించరు.చాలా రాష్ట్రాల్లో ఇది ప్రస్తుత మైన విషయం విధితమే.
ఏదైనా సమస్య తలెత్తితే రాష్ట్ర ఇన్‌చార్జీలకు, పార్టీ ప్రధాన కార్యదర్శికి చెప్పుకోవాలి.ఇవన్ని బేఖాతర్ చేసినా, బహిరంగ వేదికలపై పార్టీకి నష్టం వాటిల్లేలా చేసినా సహించేది లేదనే అభిప్రాయంలో అధిష్టానం ఉందని తెలిసింది.
ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదం ముదురు తోందా ? అంటే అవుననక తప్పదు.
పార్టీ అంతర్గత విషయాలను బహిరంగం చేస్తూ అసమ్మతి గళం వినిపిస్తున్న జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అధినేతలు మండి పడుతున్నారని తెలిసింది.
తన వ్యక్తిగత ఎజెండా కోసం పార్టీ పరువును బజారు కీడుస్తున్నాడని, ఈ క్రమంలో మార్చి 21న బహిరంగ సభ నిర్వహిస్తే చర్యలు తప్పవా ? అంటే పార్టీ ముఖ్య నేతలు అవుననే సమాధానం చెబుతున్నారు.
"""/" /
మొత్తంగా జగ్గారెడ్డి అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందని వినికిడి.
బెదరించిన ఇలాంటి వారికి అపాయింట్ మెంట్ ఇవ్వలేమని చెబుతున్నట్టు సమాచారం.అసమ్మతి పేరిట వ్యక్తిగత బల ప్రదర్శనకు జగ్గారెడ్డి పూనుకోవడం సరికాదంటున్నారు.
జగ్గారెడ్డి సబకు కాంగ్రెస్ సహకరించదని, పార్టీ ముఖ్య నేతలు కూడా ఎవరూ రారని తెలిసింది.
ఇదంతా ఆదని ఒక్కడే తనపని తాను చేసుకుని సభ పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఢిల్లీ అధిష్టానం రాష్ట్ర ముఖ్య నేతలకు చెప్పినట్టు టాక్.
కాగా జగ్గా రెడ్డి వివాదం తొండ ముదిరి ఊసరవెళ్లిలా మారుతుందా ? లేక సద్దు మణుగుతుందా ? ఇంకేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా ? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
కృష్ణ మృతికి మహేష్ బాబు కారణం… సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి!