టీడీపీలోకి కాంగ్రెస్ నాయకుల వలసల వెనుక ఇంత కథ ఉందా ...?
TeluguStop.com
టీడీపీ - కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు ఒకే అవుతుంది అనుకుంటున్న సమయంలో ఈ రెండు పార్టీలు విడి విడిగా పోటీ చేస్తామని ప్రకటించి ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
అయితే ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే ఫలితం పెద్దగా ఉండదు అని మొన్న తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో నిరూపితం అవ్వడంతో.
ఈ విధంగా ఏపీలో ప్లాన్ చేసుకున్నారు.పొత్తు లేదు విడివిడిగా పోటీ అని ఈ రెండు పార్టీలు ఆర్భాటంగా ప్రకటించుకున్నా.
చంద్రబాబు మాత్రం రాహుల్ తో నిత్యం టచ్ లో ఉంటూ.జాతీయస్థాయిలో మాత్రం పోటీ ఉంటుంది అని ప్రకటిస్తున్నాడు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీ నాయకులు కొంతమంది సైకిల్ ఎక్కడం వెనుక రీజన్ ఎవరికీ అర్ధం కావడంలేదు.
ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు.
ఈ మేరకు చంద్రబాబుతో చర్చలు జరిపారు.అనుచరులకు సందేశం పంపారు.
ఆయన చేరికకు ముహుర్తం ఖరారు చేసుకోవాల్సి ఉంది.ఇప్పుడు మరో మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా.
తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ తరపున కోట్ల కుటుంబంలానే.
దశాబ్దాల అనుబంధం వైరిచర్ల కుటుంబానికి ఉంది.అరకు నుంచి ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు.
ఓ సారి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.
కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే.గెలవడం కష్టం కాబట్టి.
ఆయన కూడా ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
రాహుల్ - చంద్రబాబు మధ్య జరిగిన చర్చల నేపథ్యంలోనే.
కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది టీడీపీ గూటికి వెళ్తున్నట్టు తెలుస్తోంది.అయితే.
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే.సమస్యలు వస్తాయి కాబట్టి.
కాంగ్రెస్ సీనియర్లను టీడీపీలో చేర్చుకుని.వారికి లోక్ సభ టిక్కెట్లు ఇవ్వాలనే కొత్తపద్దతిలో .
రాహుల్, చంద్రబాబు ముందుకెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన వారు పోగా.
కొంత మంది సీనియర్ నేతలు ఉన్నారు.పీసీసీ చీఫ్ రఘువీరా కాకుండా.
కిషోర్ చంద్రదేవ్, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, చింతామోహన్ లాంటి వాళ్లు ఇంకా కాంగ్రెస్‌లో ఉన్నారు.
వీరిలో కిషోర్ చంద్రదేవ్, సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడం మాత్రం కన్ఫర్మ్ అయిపొయింది.
మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
కుమారుడి ఆరోగ్యం పై స్పందించిన పవన్… ఇంత పెద్ద ప్రమాదమని ఊహించలేదు అంటూ!