ఢిల్లీ వార్ రూమ్ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ..!!

ఢిల్లీ వార్ రూమ్ లో ఇవాళ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరగనుంది.

ఈ మేరకు మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది.

ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు.ఇప్పటికే 50 శాతం అభ్యర్థుల ఎంపిక పూర్తి అయినట్లు తెలుస్తోంది.

119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది.

ఈ క్రమంలో మొదటి విడతలో దాదాపు 60 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు అసెంబ్లీ సీట్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ఆశావహులు పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేతలు తమకు టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తీసుకురానున్నారు.

సబ్బు ఎంత పనిచేసింది.. ఏకంగా మూడంతస్థుల మేడ మీద నుండి..