బీజేపీపై చార్జ్‎షీట్ విడుదల చేసిన కాంగ్రెస్..!!

బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress) చార్జ్‎షీట్ విడుదల చేసింది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ చార్జ్‎షీట్ ను విడుదల చేశారు.

నయవంచన పేరుతో పదేళ్ల బీజేపీ విధ్వంసంపై కాంగ్రెస్ చార్జ్‎షీట్ రూపొందించింది.చార్జ్‎షీట్ రిలీజ్ చేసిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని తెలిపారు.జీఎస్టీ పేరుతో బీజేపీ దేశాన్ని దోచుకుందన్నారు.

దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) 14 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే మోదీ రెండింతలు ఎక్కువ అప్పులు చేశారని ఆరోపించారు.

రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని మోసం చేశారని, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందన్నారు.బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే దారి తీస్తోందన్నారు.

రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ( Rahul Gandhi ) హామీ ఇచ్చారని తెలిపారు.