కాంగ్రెస్ పంచ్.. కే‌సి‌ఆర్ లో భయం పట్టుకుందా ?

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.ఒకవైపు ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నా మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం ఎలక్షన్ మూడ్ లో హిట్ పెంచుతున్నాయి.

అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన బి‌ఆర్‌ఎస్( BRS Party )ఎన్నికలపై కన్ఫ్యూజన్ నెలకొనడంతో కొంత సైలెంట్ అయింది.

ఇక అభ్యర్థుల విషయంలో కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్.ప్రస్తుతానికి అభ్యర్థుల ఎంపికను హోల్డ్ లో పెట్టింది.

దీంతో ఎన్నికల స్ట్రాటజీలో ఏ పార్టీ ఎలా వ్యవహరించనుందనేది ఊహించలేని అంశంగా మారింది.

"""/" / అయితే తాజాగా తెలంగాణలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాలతో కాంగ్రెస్ లో కొత్త ఊపు కనిపిస్తోంది.

జాతీయ నేతలంతా రాష్ట్రనికి వచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించడంతో కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ ఉరకలేస్తోంది.

ఇదే ఊపులో ఐదు హామీలను ప్రకటించి మరింత హైప్ క్రియేట్ చేసింది హస్తం పార్టీ.

మహిళలు, రైతులు, నిరుద్యోగులు.ఇలా అందరినీ దృష్టిలో ఉంచుకొని హామీలను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ హామీలు చర్చనీయాంశం అవుతున్నాయి.

అయితే కర్నాటకలో( Karnataka ) అమలు చేస్తున్న హామీలనే ఇక్కడ కూడా ప్రకటించినప్పటికి ప్రజలను తమవైపు తిప్పుకోవడంలో హస్తం నేతలు సక్సస్ అవుతున్నారనే చెప్పవచ్చు.

"""/" / దీంతో హస్తం పార్టీ దూకుడుకు ఎలా కళ్ళెం వెయ్యాలనే దానిపై బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్( CM KCR )మల్లగుల్లాలు పడుతున్నారట.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రకటించిన ఐదు హామీలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకముందే.ఇటు బి‌ఆర్‌ఎస్ హామీలను కూడా ప్రకటిస్తే మేలని గులాబీ బాస్ భావిస్తున్నారట.

దీంతో అంతకు మించి అనేలా హామీలను పథకాలను ప్రకటించే పనిలో ఉన్నారు కే‌సి‌ఆర్.

త్వరలోనే బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది.అదే సమయంలో కాంగ్రెస్ హామీల పట్ల వ్యతిరేకత పెంచేలా కూడా గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారట.

మొత్తానికి హస్తం పార్టీ ప్రకటించిన హామీలతో కే‌సి‌ఆర్ అలెర్ట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఆ రెండు దేశాలలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?